
అయితే దీనిపై ఈ స్వలింగ సంపర్క దోరణి పట్టణ ఉన్నత వర్గ ధోరణి ప్రతిబింబిస్తోందని కేంద్ర తన వాదనలు వినిపించింది. స్వలింగ ధోరణి పట్టణ ప్రజలకే అన్న ఆధారాలు కేంద్రం చూపలేకపోయిందని వ్యాఖ్యనించింది. లైంగిక ధోరణి, స్వతసిద్ధ భావనే తప్ప సామాజిక వర్గ, ప్రతిపాదికలు ఏమీ ఉండవని చెప్పింది. సీనియర్ న్యాయవాది సింఘ్వి వాదనతో ఏకభవీస్తునే స్వేచ్చాయుత పట్టణ వాతావరణంలో ఇలాంటి ధోరణి ఉండొచ్చని తెలిపింది.
స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే స్త్రీ, పురుషుల వివాహాలకు సంబంధించి తలెత్తే సమస్యలను లోతుగా సుప్రీం చర్చించింది. అయితే దత్తత తీసుకునే సమయంలో పిల్లల స్వభావం ఆ తల్లిదండ్రుల మనస్తత్వంపై ఎలా ప్రభావితం చూపుతుందనేది గ్రహించాలి. పార్లమెంట్ లో సుప్రీంకోర్టే అధికారం తీసుకుని దీన్ని చట్ట బద్ధత కల్పించాలని పిటిషనర్ తరపు ముకుల్ రోహిత్ కోరారు.
అత్యున్నత సుప్రీం కోర్టుకు ఉన్న అధికారాల తో స్వలింగ సంపర్కులకు చట్ట బద్ధత కల్పించాలని వారి హక్కులను కాపాడాలని కోరారు. స్వలింగ సంపర్కాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వైఖరి తెలపాలని అనుమతించాలని సుప్రీంను కోరారు. అయితే స్వలింగ సంపర్క వివాహాలు జరిగితే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే వివరాలను తెలపాలని సుప్రీం తెలిపింది. ఏదైమైనా వీరికి చట్టబద్ధగా కల్పించే విషయంలో వాడీవేడీగా వాదనలు కొనసాగుతున్నాయి.