భూమిపై అనేక జీవులు ఉన్నాయి. లక్షల కోట్ల జీవ పరిణామ క్రమంలో ప్రాణికోటి పుట్టుకొచ్చింది. అయితే ప్రాణకోటి పుట్టడానికి ఇంత ప్రాసెస్ జరిగితే, ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల ప్రాసెస్ జరిగితే, నక్షత్రాలు పేలుడు అనేది సంభవిస్తే అంతకన్నా తక్కువ కాలంలోనే మహా చెప్పాలంటే దశాబ్దాలలోనే ఈ ప్రాణికోటి అంతా అంతమైపోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు. వాళ్లు చెప్పేది ఏంటంటే నక్షత్రాల పేలుడు సంభవిస్తే అది దగ్గరలో ఉన్న గ్రహాల మీద ప్రభావం చూపిస్తుందని ఆ గ్రహాల మీద జీవకోటి మనుగడ దానివల్ల అసాధ్యం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు.


అసలు భూమిపై జీవకోటి మనుగడకు అసలైన కారణం దానికి అనుకూలమైన వాతావరణం ఉండడమే. కానీ ఇక్కడ వాతావరణం విషతుల్యమైతే ఇదే భూగోళం పైన మనుగడ సాగించడం అసాధ్యమైపోతుందని వాళ్ళు అంటున్నారు. ‌ అంతరిక్షంలో సుదూర తీరంలో ఉన్న సూపర్ నోవాల నుండి భూగోళానికి ముప్పు తప్పదని, దాన్ని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదని అమెరికాకి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఇదిలా ఎందుకు సంభవిస్తుంది అంటే అంతరిక్షంలో ఉన్న అనేక నక్షత్రాలన్నీ కలిసి సూపర్ నోవాల మారి పేలిపోయి లాస్ట్ పెయిర్ అనేది ఏర్పడుతుంది, దీనివల్ల అత్యంత ప్రమాదమైన ఎక్స్ కిరణాలు వెలువడి దగ్గర్లో ఉన్న గ్రహాలను చేరుతాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. దాని నుండి వెలువడే అల్ట్రా వైలెట్ రేస్ నుండి భూమిని కాపాడడానికి మనకు మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.


అయితే ఇప్పుడు ఈ ఎక్స్ కిరణాలు ఈ ఓజోన్ పొరని విచ్ఛిన్నం చేస్తాయట. దాంతో యూవి కిరణాల రేడియేషన్ డైరెక్ట్ గా భూమి పైకి చేరుతుంది. దానివల్ల నైట్రోజన్ డయాక్సైడ్ అని విషపూరితమైన వాయువు భూమి మీదకు వెలబడుతుంది. అది వెలువడినప్పుడు ఒక గోధుమ రంగు లేయర్ భూమి చుట్టూ ఏర్పడి జీవజాలాలు అంతరించిపోతాయని యూనివర్సిటీ ఆఫ్ బల్నాయి శాస్త్రవేత్తలు చెప్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: