టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. పవర్ ఫుల్ కథాంశాలతో బాలయ్య సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. బాలయ్య బాడీ లంగ్వేజ్ కి తగ్గ కథల్లో ఆయన మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తారు. ఆయన చేసిన సినిమాలను పరిశీలిస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం ఆయన మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బీబీ3గా ఈ సినిమాపై అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు హీరోయన్ కష్టాలు వస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి.

బీబీ3లో బాలయ్యకు జోడిగా మళయాళ నటి ప్రయాగ మార్టిన్ ను దర్శకుడు బోయపాటి సెలెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. తెలుగు తెరకు కొత్త హీరోయన్ పరిచయమవుతోందనే అందరూ అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా నుంచి ప్రయాగ మార్టిన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య పక్కన ప్రయాగ తేలిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆమెను తప్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్యకు మరో హీరోయిన్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మరో హీరోయిన్ గా పూర్ణ నటిస్తోందని తెలుస్తోంది.

తెలుగులో సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఉందనే విషయం తెలిసిందే. బాలయ్య కూడా ఇలా హీరోయిన్ల సమస్య వచ్చినప్పుడు తన గత సినిమాల్లోనే పని చేసిన శ్రియ, సొనాల్ చౌహాన్, నయనతార.. తో మళ్లీ హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా శ్రియ, అంజలి పేర్లు రౌండ్ అయ్యాయి. కానీ.. వేరే హీరోయన్లు ఫైనల్ అవుతున్నారు. మరి హీరోయిన్లుగా ఎవరు చేస్తున్నారో టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: