
ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అన్నం తింకూండా మారం చేస్తే వారిచేత అన్నం తినిపించాడు ప్రతి ఒక్క తల్లి పాడే పాట, "చందమామ రావే జాబిల్లి రావే.. కొండెక్కి రావే..గోగుపూలు తేవే...". ఈ పాట గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తికాదు. అంతగా ఈ పాట ప్రతి ఇంటి తల్లి గొంతులో నానుతూ ఉంది. ఈ పాటలో ప్రతి ఒక్క పదం అర్థవంతంగా ఉంటుంది. చాలా మంది తల్లులకు ఈ పాట ఎవరు రాశారు? ఎవరు స్వర పరిచారు? ఎవరు పాడారు? అన్న విషయాలు తెలిసి ఉండకపోవచ్చు.
ఈ పాట కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన 'సిరివెన్నెల' మూవీ లోనిది. ఈ పాటను సందర్భానికి తగినట్లుగా ఎంతో అద్భుతంగా రాశారు. అంత మంచి పాటకు మధురమయిన బాణీలు సమకూర్చి సుమధురంగా తీర్చిదిద్దారు సంగీత దర్శకుడు కెవి మహదేవన్. ఈ పాటను అంతకు మించిన నైపుణ్యంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు పి సుశీల ఆలపించారు. ఈ రోజు ఈయన చనిపోయాడు అనే మాట వింటుంటే ఎవ్వరికీ నమ్మబుద్ది కావడం లేదు. ఈ పాట లోని కమ్మదనం, అమ్మతనం ఆయన రాసిన పాట రూపంలో చూశాము. కానీ ఇక ఎప్పటికీ ఆయనను చూడలేము.