రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీతో లైగర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఈ మూవీలో క్రేజీ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో పాటుగా రీసెంట్ గా లైగర్ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై బీభత్సమైన బజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పక్కా నేషనల్ స్టార్ గా మారతాడని ఫిక్స్ అవుతున్నారు.

ఇదిలాఉంటే ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ వెంటనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తారని అనుకున్నారు కానీ ముందే ఇచ్చిన కమిట్ మెంట్ వల్ల లిగెర్ తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ముందు తీసిన రెండు సినిమాలు హిట్ అందుకున్న శివ నిర్వాణ థర్డ్ మూవీ టక్ జగదీష్ తో ఫ్లాప్ అందుకున్నాడు. ఓటీటీలో రిలీజైనా సరే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందని తెలిసిందే. విజయ్ దేవరకొండ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్స్తున్నాడు శివ.

ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ సుక్కు అదిరిపోయే క్రేజీ కాంబో మూవీ ఒకటి ప్లానింగ్ లో ఉంది. ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ లాస్ట్ ఇయర్ వచ్చినా సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం పుష్ప సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుక్కు ఈ ఇయర్ మొత్తం పుష్ప 2 కోసం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు. అసలైతే పుష్ప 2 ఈ ఇయర్ రిలీజ్ అనుకున్నా పరిస్థితులని బట్టి పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఈలోగా విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా పూర్తి చేసి సుక్కు కోసం సిద్ధమవుతాడు. 2023 చివర్లో ఈ సినిమా స్టార్ట్ అయినా 2024 లోనే విజయ్ దేవరకొండ, సుకుమార్ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అంటే ఆ సినిమా కోసం ఎలా లేదన్నా రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: