టిడిపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. కెసిఆర్ లాంటి,  తన లాంటి, వంశీ లాంటి   మనుషులను తానే తయారు చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు... అంత పోటుగాడు  అయితే తెలుగుదేశం పార్టీని వీడి సిబిఎన్  తెలుగుదేశం అంటూ కొత్త పార్టీని పెట్టి గెలిచి చూపించాలి అని సవాల్ విసిరారు కొడాలి నాని. అలా సిబిఎన్ తెలుగుదేశం  అనే పార్టీ పెడితే చంద్రబాబుకు  కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అంటూ విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు కు  కనీసం ప్రతిపక్ష హోదా  కూడా దక్కదు అంటూ హెచ్చరించారు. టిడిపి పార్టీ ని తీసుకొచ్చి వైసీపీ కార్యాలయం స్టోర్  రూమ్ లో పెట్టిస్తాం అంటూ ఎద్దేవా చేసారు. అందరిని ఆయనే తయారు చేశాను  అని చెప్పుకునే చంద్రబాబు... చంద్రబాబు ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారూ అంటూ కోడాలి నానీ  ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేను  చేసి మంత్రి పదవి ఇచ్చిన పార్టీని వీడి తెలుగుదేశం లోకి వచ్చావు... తెలుగుదేశం లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచారు అంటూ  చంద్రబాబును ఉద్దేశించి ఆరోపించారు కొడాలి నాని. 

 

 

 

 టీడీపీ అధినేత చంద్రబాబు టైం అయిపోయిందని ఇంకో వేయి జన్మలెత్తినా చంద్రబాబు సీఎం కాలేడంటూ  కొడాలి నాని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసానని ట్రంప్ ను  అమెరికాకి అధ్యక్షుడిని కూడా తానే చేశానని చెప్పుకునే  చంద్రబాబు... తన సొంతూరు ఉన్న  చంద్రగిరి నియోజకవర్గంలోని ఎందుకు టిడిపిని గెలిపించుకోలేక  పోతున్నారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ వల్లే పార్టీలో ముసలం మొదలైందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీలో సంక్షోభం ఏర్పడింది అంటూ విమర్శించారు. చంద్రబాబు ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా అయితే ఆయనను మానసికంగా హింసించారో ... అలాంటి గతే  ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు పెట్టబోతున్నట్లు కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 ప్రస్తుతం ఇసుక ఇంగ్లీష్ హిందూమతం తప్ప టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మాట్లాడడానికి మరే  అంశం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంతూరు ఉన్న నియోజకవర్గంలో టిడిపి కేవలం ఎన్టీఆర్ హయాంలోనే గెలిచిందని ... టిడిపి పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక ఒకసారి కూడా తన నియోజకవర్గంలో టీడీపీ ని గెలిపోయించుకోలేక పోయారు  అంటూ ఎద్దేవా చేశారు.అంతా  సత్తా ఉన్న నాయకుడు అయితే తన నియోజకవర్గంలోని ఎందుకు గెలవలేక పోతున్నారని నిలదీస్తారు కొడాలి నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: