
భారతదేశంలో కూడా రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో ఎక్కువగా కరోనా బారిన పడిన వారు మహారాష్ట్రలో ఉన్నారు. కోవిడ్- 19 మహారాష్ట్రలో తన పంజా విసురుతుంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇక్కడ మహారాష్ట్ర గురించి చర్చించుగోదగ్గ విషయం ఏంటంటే.. ఒకే కుటుంబంలోని 25 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కొన్నిరోజుల కిందట సాంగ్లి జిల్లా ఇస్లామ్ పూర్ లో ఓ ఉమ్మడి కుటుంబంలోని నలుగురు వ్యక్తులు సౌదీ అరేబియాలో పర్యటించి కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు వచ్చారు. ఇక అప్పటి నుంచి మొదలైంది ఈ కరోనా కేసుల గొడవ. వారికీ చేసిన కరోనా పరీక్షల్లో మార్చి 23న కరోనా వచ్చినట్లు నిర్దారణ అయింది. ఈ అనుమానంతో ఆ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు.
అనంతరం వారికి పరీక్షలు చేయగా వారం రోజుల వ్యవధిలోనే మరో 21 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా వచ్చిన వారిలో రెండు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. మొత్తంగా కుటుంబంలోని 47 మందికి టెస్ట్ లు చేయగా 25 మంది కరోనా బారినపడ్డారని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయని, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వైరస్ బాధిత కుటుంబ సభ్యులందరు పక్క పక్కన ఇళ్లలోనే నివాసముంటున్నారు.
దీనివలన వైరస్ సోకిన వ్యక్తిని నేరుగా తాకడం వల్లే కరోనా వైరస్ సంక్రమించిందని చెప్పారు. అందువలనే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమించిందని కలెక్టర్ అభిజిత్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 215 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా సోమవారం మరో 12 మంది కరోనా వైరస్ భారిన పడినట్లు నిర్దారణ అయింది. ఈ 12 కేసులు పుణెలో 5, ముంబైలో 3, నాగ్‌పూర్ లో 2, నాసిక్‌లో 1, కొల్హాపూర్ లో 1 గా ఉన్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle
https://tinyurl.com/NIHWNapple