
గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు. 1946, 1947 రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలామంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి లజపతిరాయ్ అప్పుడు చెప్పిన మాటలు ఆసరా అయ్యాయనిపిస్తాయి కూడా. లజపతిరాయ్ (జనవరి 28, 1865– నవంబర్ 17, 1928) పంజాబ్‌లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్‌దేవి. రాధాకిషన్ ఉర్దూ, పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. చాలామంది బిడ్డల మీద తండ్రి ప్రభావం ఉన్నట్టే, చిన్నారి లజపతిరాయ్ మీద రాధాకిషన్ ప్రభావమే ఉండేది. అంటే ఇస్లాం ప్రభావమే.
రాధాకిషన్ సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్‌కు వీరాభిమాని. అహమ్మద్ ఖాన్ భారతీయ ముస్లిం సమాజ సంస్కరణకి తోడ్పడిన వారు. అయితే ఆ సంస్కరణ ఇస్లాం పరిధిని దాటని సంస్కరణ. స్వాతంత్ర్య సమరం నడిపిన తొలితరం నాయకులలో లాలా లజపతిరాయ్ ఒకరు. ఒకవైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉద్యమాలలో ప్రవేసించారు. 1885సంలో. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన నాటినుండి కాంగ్రెస్ సభ్యుడిగా ఉంటూ ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించాడు. గాంధీ రాకతో నాయకత్వం గాంధీకి అప్పగించి తనవంతు కృషిని కొనసాగించాడు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా పాల్గొని బ్రిటీష్ అధికారి చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. తరువాత క్రమంగా నీరసపడిపోయి నవంబర్ 17 1928 సం.లో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. భారతదేశ ప్రజలు ముద్దుగా ఇతనిని ‘పంజాబ్ కేసరి’ అని పిలుచు కుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు కూడా కావడం గమనార్హం.