
జీర్ణ క్రియకు ఇలా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఉల్లిపాయను ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఉల్లి పచ్చడి గురించి దాని తయారీ విధానం గురించి ఇపుడు తెలుసుకుందాం.
ఉల్లి పచ్చడికి కావల్సిన పదార్థాలు..
* 3 ఉల్లిపాయలు పెద్దగా తరిగి పెట్టుకోవాలి.
* నూనె – రెండు టేబుల్ స్పూన్లు,
* మినప పప్పు – ఒక టీ స్పూన్,
* శనగ పప్పు – ఒక టీ స్పూన్,
* ఎండు మిరపకాయలు – ఒక పన్నెండు
* కరివేపాకు – కొంచం,
* ధనియాలు – ఒక టీ స్పూన్,
* జీలకర్ర – ఒక టీ స్పూన్,
* చింతపండు – ఒక 10 గ్రాముల వరకు లేదా మీకు సరిపడినంత,
* పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొంచం, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత,
నీళ్లు – కొంచం.
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె పోసి... కాగాక ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత అదే నూనెలో శనగ పప్పును, మినప పప్పును, ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసి వేయించాలి. వేగాక ధనియాలను, జీలకర్రను వేసి వేయించి తర్వాత దానిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించి అందులోనే చింతపండు కూడా వేసి వేగాక ... పసుపును, కొత్తిమీరను వేసి ఆపేయాలి. తరువాత మిక్సీ జార్ లో వేసిన వాటన్నింటినీ మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఇలా చేసిన తరువాత ఇందులోనే వేయించిన ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును కూడా మిక్సి కి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తాళింపు పదార్థాలను వేసి తాళింపు పెట్టుకోవాలి. ఇక ముందుగా తయారుచేసుకున్న ఉల్లిపాయ మిశ్రమానికి ఈ తాలింపు ను కలిపి వడ్డించుకుంటే సరి... పచ్చడి రెడీ. ఇది దోశ ,ఇడ్లీ ఇలా ఏ టిఫిన్ లో వేసుకున్నా రుచిగా ఉంటుంది. అన్నం లో తిన్నా కూడా చాలా బాగుంటుంది.