వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై టీడీపీ ఎన్ని సార్లు, ఏ విధంగా ప్రయత్నం చేసినా ఆయన్ని ప్రజలు నమ్మారు. వైఎస్ చేసినా మంచి పనులు విద్య, వైద్యం పేద ప్రజలకు అందాలని చేసిన ప్రయత్నంలో ఆయన విజయవంతం అయ్యారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందడం ఎంతో హర్షించదగిన విషయం.


అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వ్యతిరేక వార్తలు రాసే వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ మార్గదర్శి ఫైనాన్స్ ను అప్పట్లో క్లోజ్ చేయించగలిగాడు. చంద్రబాబు మీద కేసుల్ని పెట్టినా వాటిని విత్ డ్రా చేసుకోక తప్పలేదు. కానీ సంక్షేమ పథకాల్లో వైఎస్ ను ప్రతి ఒక్కరూ గుర్తించుకున్నారు. అదే విషయంలో జగన్ కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, పెద్ద చదువులు చదువుకునే వారికి వైఎస్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు.


దానికి మించి వైఎస్ జగన్ స్కూలు విద్యార్థులకే అమ్మఒడి పథకం కింద నిరుపేదలకు రూ.10 వేలు ఇవ్వడం అనేది అందరి ఇళ్లలోకి చేరింది. ఇంటి దగ్గరకే పెన్షన్ ఇవ్వడం అనేది చర్చనీయాంశం చేసింది. ఇక ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయలేనిది జగన్ చేసి చూపించాడన్న వాదన వినిపిస్తోంది. రామోజీరావును ఆయన ఇంట్లోనే విచారించడం అనేది పెద్ద సంచలనంగా మారింది. మార్గదర్శి చిట్ పండ్స్ లో అవినీతి ఆరోపణలపై ఆయనను  ఏపీ సీబీఐ విచారిస్తుంది. తరతరాలుగా  వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని తమ మీదకు సీబీఐ, ఈడీ రాకుండా స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్లు కాలం వెల్లదీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.


ప్రస్తుతం రామోజీరావు, మార్గదర్శి సంస్థలపై విచారణ జరగడం అనేది ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత సాహసం రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేకపోయారంటున్నారు. మరి ఏపీ సీబీఐ విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో చూడాలి. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కాస్తా ఇప్పుడు ఈనాడు రామోజీ పైకి మళ్లినట్టు కనిపిస్తోంది. నెక్స్ట్‌ ఎవరనేది చర్చ ఏపీలో జోరుగా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: