
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆదివారం ఇండస్ట్రీకి వచ్చి 28 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇన్నేళ్లుగా తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఆ కామెంట్ తో పాటు తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఆ ఫోటోలో లాంగ్ హెయిర్‌తో, లైట్‌గా గెడ్డంతో మ్యాన్లీగా ఉన్నాడు షారూఖ్.
అయితే ఈ ఫోటోపై సపోర్టింగ్ యాక్టర్ అర్షద్ వార్సీ ఆసక్తికరంగా స్పందించాడు. షారూక్ పోస్ట్ ను రీపోస్ట్ చేసిన అర్షద్, `ఈ ఫోటో ఏ మాగాడిలో అయిన గేగా మారాలన్న కోరిక కలిగిస్తుంది` అంటూ కామెంట్ చేశాడు. అయితే అర్షద్ చేసిన ఈ పోస్ట్‌కు వేయికి పైగా షేర్స్ తో పాటు దాదాపు 5 వేల లైక్స్ వచ్చాయి.
This pic would make any man turn gay 😜 https://t.co/vwKsB5jBjS
— arshad warsi (@ArshadWarsi) June 28, 2020
కొంత మంది అర్షద్ కామెంట్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేయగా.. మరికొందరు ట్రోల్ చేశారు. ఓ వ్యక్తి `నేను షారూఖ్ కోసం 95 శాతం స్ట్రయిట్, 5 శాతం గే` అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి `అవును అవకాశం ఉంటే` అంటూ కామెంట్ చేశాడు. అర్షద్ నెక్ట్స్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఫేం రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
రాజ్‌కుమార్ హిరానీ మున్నాబాయ్ సినిమా కోసం ముందుగా షారూఖ్‌నే సంప్రదించాడు. అయితే షారూఖ్ ఆ పాత్రలో నటించేందుకు నో చెప్పటంతో సంజయ్ దత్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా సమాచారం ప్రకార్ షారూఖ్ నెక్ట్స్ సినిమాను రాజ్ కుమార్ హిరాని ప్రొడక్షన్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.