మంత్రి పేర్ని నాని కేబినేట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. కడప జిల్లాలో వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ ను జాయింట్ వెంచర్ ద్వారా నిర్మాణం చేస్తామని అన్నారు. కాకినాడ సెజ్ కోసం తీసుకున్న 2180 ఎకరాల భూమిని తిరిగి రైతులకు ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నారు. కాకినాడ సెజ్ విషయంలో చంద్రబాబు రైతులకు మాట ఇచ్చి మోసం చేసారు చేసారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాలు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రధానికి సీఎం లేఖ రాశారు అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రం లోని మున్సిపాలిటీ లు అన్నింటినీ సూరత్ తరహాలో లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అవినీతి చేస్తూ రెడ్ హండెడ్ గా దొరికితే వారిపై 100 రోజుల్లో చర్యలు తీసుకొవాలి అని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చట్ట సవరణ చేస్తామని చర్యలు తీసుకోక పోతే సంబంధిత విచారణ అధికారిపై చర్యలు తీసుకునేలా సవరణ ఉంటుంది అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పై వత్తిడి తెచ్చే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అధికారులపై చర్యలకు గడువు రెండేళ్ల నుంచి 90 రోజులకు కుదించామని ఆయన వివరించారు. చర్యలు తీసుకోని ఏసీబీ అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేస్తామని అన్నారు. మున్సిపాలిటీల్లో రోడ్లను వెంటనే రిపేర్ చేయడం, విస్తరణకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణకు కొత్త వాహనాలు వస్తాయని అన్నారు. సూరత్ తో పోటీపడుతూ పట్టణాలు, నగరాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: