
అయితే వీరందరూ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవాని విజయం సాధించారు. ఇదిలా ఉంటే గత ఎన్నిక ల కు ముందు ఉన్నత ఉద్యోగం చేస్తున్నా బాలయోగి తనయుడు హరీష్ అమలాపురం ఎంపీ గా పోటీ చేసి గట్టి పోటీ మధ్య ఓడిపోయారు. ఒకానొక దశలో హరీష్ కచ్చితంగా గెలుస్తారని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అమలాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం గట్టిగా ఉంది.
జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో వైసీపీ నుంచి పోటీ చేసిన చింతా అనూరాధ 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ జనసేన అభ్యర్థి ఏకంగా 2 లక్షల 50 వేల ఓట్లు వచ్చాయి. దీనిని బట్టే ఎక్కడ జనసేన ఓట్లు ఎలా చీలిపోయాయో తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినా హరీష్ మాత్రం నియోజకవర్గంలోని ఉంటూ పార్టీని పటిష్టం చేస్తూ వస్తున్నారు.
మరోవైపు వైసీపీ పై వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. అమలాపురం పార్లమెంటు పరిధిలో రాజోలు - కొత్తపేట - ముమ్మిడివరం - పి గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిణామాలు అన్నీ అక్కడ వచ్చే ఎన్నికల్లో హరీష్ గెలుపు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేన - టిడిపి పొత్తు ఉంటే హరీష్ కచ్చితంగా భారీ మెజార్టీ తో పార్లమెంటులో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.