మిత్రపక్షమే అయినా బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద షాకే ఇచ్చారు. బీజేపీకి మద్దతుగా ఇప్పటివరకు పవన్ కానీ లేదా సీనియర్ నేతలు కానీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవటమే విచిత్రంగా ఉంది. జనసేన నుండి తమకు మద్దతుగా ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్న కమలనాదులకు తీవ్ర నిరాసే ఎదురైంది. దాంతో పవన్ వైఖరిని ఎలా అర్ధం చేసుకోవాలో కమలనాదులకు అర్ధం కావటంలేదు.




ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో ఒక స్కూలుంది. ఆ స్కూలు వెనకాల ఖాళీ స్ధలంలో ముస్లింలు మసీదును నిర్మించుకుంటున్నారు. మసీదు నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారంటు బీజేపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అంతటితో ఆగకుండా సదరు నిర్మాణాన్ని కేల్చేసేందుకు మద్దతుదారులతో ప్రయత్నించారు. బుడ్డా ప్రయత్నాన్ని ముస్లింలు అడ్డుకున్నారు. దాంతో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవైంది.




ఎప్పుడైతే ముస్లింల నుండి ప్రతిఘటన పెరిగిపోయిందో రక్షణకోసం వెంటనే బుడ్దా పోలీసు స్టేషన్ కు వెళ్ళారు. అయితే ఇక్కడే బీజేపీ నేతల వాదన మరోరకంగా ఉంది. ముస్లింలకు మద్దతుగా తమ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారంటు నానా గోల మొదలుపెట్టారు. ఇదే విషయమై రాష్ట్రంలోని బీజేపీ నేతలంతా వరసబెట్టి ఆత్మకూరుకు వెళ్ళటం, మీడియా ముందు ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన రెడ్డి అయితే రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తోందంటు మండిపోయారు.




సరే ఇదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ మాత్రం బీజేపీకి మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పవన్ కాదు కదా కనీసం సీనియర్ నేతల్లో ఏ ఒక్కరూ కమలంపార్టీకి మద్దతుగా నిలవలేదు. ఇక్కడే బీజేపీ నేతలకు పవన్ వైఖరి షాక్ కొట్టినట్లయ్యింది. బహుశా ముస్లింలను దూరం చేసుకోవటం ఇష్టంలేకే పవన్ ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: