
చాలా రోజుల నుంచి ఇండస్ట్రీకి సాక్షి పేపర్ కు మంచి అనుబంధం ఉంది. అలానే జగన్ మీడియా మొత్తం చాలా సందర్భాల్లో ముఖ్యంగా డ్రగ్ కేసులలో కూడా సానుభూతి వాక్యాలు రాసిన దాఖలాలు ఉన్నాయి.ఆ కేసుల్లో నిజం ఎంత అన్నది దర్యాప్తు సంస్థలే తేల్చలేదు కనుక ఆ సంగతి ఇప్పుడు అప్రస్తుతం.చిరంజీవి మాత్రం ఎవరు ఔనన్నా కాదన్నా జగన్ తో పాత బంధాలను వదులుకోలేదు.ఆ పార్టీ గూటికి చేరడం అన్నది కూడా ఖాయం కావొచ్చు.చిరు ఎప్పటి నుంచో జగన్ తో మాట్లాడతానని అంటున్నా ఎందుకనో వర్కౌట్ కాలేదు అని ఇవాళ నాగ్ మాటలను చూస్తే అర్థం అవుతుంది.సీన్ లో నాగ్ సైడ్ అయి చిరు వస్తే తన అవసరం ఎంత ఉందన్నది ఇండస్ట్రీకి తెలియజెప్పే ప్రయత్నం ఒకటి స్పష్టంగా చేయనున్నారని మాత్రం చెప్పవచ్చు.
ఇవాళ చర్చలు ఎలా ఉన్నా వైసీపీ గూటికి త్వరలో మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నారన్న వార్త పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఎట్టకేలకు ఇందుకు తగ్గ రూట్ ను క్లియర్ చేసేందుకు ఇవాళ్టి లంచ్ మీట్ ఉపయోగపడనుందని కూడా భావిస్తున్నారు. ఎలానూ తమ్ముడి రాజకీయ పంథాను మార్చలేరు కనుక తానే వైసీపీకి వెళ్లి ఆ పార్టీకి వీలున్నంత మేర సాయం చేయాలని యోచిస్తున్నారు. అందుకు తాగా భేటీ ఉపయోగపడితే చాలు అన్నది చిరు భావన.ఇక సీన్ లో నుంచి తెలివిగా తప్పుకున్న నాగ్ భారమంతా చిరంజీవిపై వేసి ఇండస్ట్రీ భారతాన్ని వినిపించమని చెప్పాడు.దీంతో టికెట్ ధరలు తగ్గినా పెరిగినా రాబోవు రోజుల్లో ఇండస్ట్రీ నుంచి వైసీపీ ఆశిస్తున్న మద్దతుపైనే ప్రధాన చర్చ నడుస్తోంది.వైసీపీకి ఇప్పటికిప్పుడు స్టార్ క్యాంపైనర్లు కావాలి. అందుకే చిరు జోలికి వెళ్తున్నారని కూడా తెలుస్తోంది.ఇదే కనుక నిజం అయితే రాబోవు రోజుల్లో టీడీపీ బ్యాచ్ మెగాస్టార్ ను టార్గెట్ చేయడం కూడా ఖాయం.