మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్.. వైఎస్ నుంచి లోకేష్ వరకూ పాదయాత్రలు చూశానని అన్నారు. అయితే.. గతంలో ఎప్పుడూ చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ అన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్.. నాడు కాంగ్రెస్ జగన్ ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని అభిప్రాయపడ్డారు.


అలాగే.. సుప్రీంకోర్టులో ఈనెల 22న  రాష్ట్ర విభజన కేసుపై వాయిదా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ తెలిపారు. ఇంకా నాలుగు రోజులు సమయం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ సూచించారు.  ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్న ఉండవల్లి.. తన వాదన సరైందని సజ్జల  అన్నారని.. గుర్తు చేశారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: