డబ్బు సంపాదించాలని కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి సరైన స్కీమ్స్ తెలియక తికమక పడుతుంటారు కొందరు. అలాంటి వారు ఈ స్కీమ్స్ గురించి తెలుసుకొండి.. కోటీశ్వరులు అవ్వండి. ఇంకా అవి ఏ స్కీమ్ అంటే?  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్). ఈ రెండు స్కీమ్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

 

ఈ రెండు స్కీమ్స్ మంచివే. ఇందులో ఏ ఒక్క స్కీమ్ లో చేరినా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. రెండింటికీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఈ పన్ను మినహాయింపు కారణంగా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 

 

ఇంకా పన్ను మినహాయింపు పొందలి అంటే జులై 31వ తేదీలోపు ఈ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే పీపీఎఫ్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. దీనిలో కచ్చితమైన లాభం పొందుతారు. అలానే పీపీఎఫ్‌ వడ్డీ రేటును కేంద్రం ప్రతి మూడు నెలలు ఒకసారి రివ్యూ చేస్తుంది. 

 

ఇంకా అదే ఈఎల్ఎస్ఎస్ అనేది ఈక్విటీ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ మార్కెట్ లో మంచి పనితీరు కనబరిస్తే అదిరిపోయే లాభాలు ఉంటాయి, లేదంటే రిస్క్ ఉంటుంది. కాగా ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇంకా ఈఎల్ఎస్ఎస్ గత పది సంవత్సరాలలో సిప్ రాబడి 9 నుంచి 13 శాతం మధ్యలో ఉంటుంది. 

 

అయితే పీపీఎఫ్‌లో రోజుకు 400 రూపాయిలు ఆదా చేసి ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇలా 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే చేతికి రూ.1.03 కోట్లు లభిస్తాయి. ఇంకా ఈఎల్ఎస్ఎస్‌లో అయితే 22 ఏళ్లకే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. దీని బట్టి చూస్తే ఇందులో ఏ స్కీమ్ తీసుకున్న కోటీశ్వరులు అవుతారు అని చెప్పచ్చు. 

 

పీపీఎఫ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అదే ఈఎల్ఎస్ఎస్ విషయానికి వస్తే.. గత పదేళ్లలో సిప్ రాబడి 9 నుంచి 13 శాతం మధ్యలో ఉంది. పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే రోజుకు దాదాపు రూ.400 ఆదా చేయాలి. కోటీశ్వరుల కావాలంటే పీపీఎఫ్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. చేతికి రూ.1.03 కోట్లు లభిస్తాయి. అదే ఈఎల్ఎస్ఎస్‌లో అయితే 22 ఏళ్లకు కోటీశ్వరులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: