తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదికొచ్చింది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.  బీజేపీలో ఉన్న విష్ణుకుమార్ రాజు బీజేపీ అధిష్టానంతో చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందనే చెప్పే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ బీజేపీకి కనీసం 5 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఒక వేళ పది ఇస్తే అదే గొప్ప. మరి అంత తక్కువ సీట్లలో బీజేపీ పోటీ చేస్తే గతంలో ఎదురైన పరిస్థితి టీడీపీ నుంచి ఎదురుకాదని గ్యారంటీ ఎంటీ అని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. అవసరమైతే ఎంపీ సీట్లు ఇస్తామని అంటారు.


రెండో అంశం జనసేన మొన్నటి వరకు రెండున్నరేళ్లు సీఎంగా పవన్ కల్యాణ్ అని భావించినా, ఇప్పుడు జనసేన కార్యకర్తలు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు. కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టిన జనసేన, టీడీపీని ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వమని ఎలా అడుగుతుందని బయట వినిపిస్తున్న టాక్. అసలు బేరం ఆడే శక్తి కోల్పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


వైసీపీలో అసంతృప్తులు ఎంతమంది ఉన్నారో వారు ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రా రాజకీయాలు ఒక్కసారిగా టర్నింగ్ తీసుకున్నాయి. మొన్నటి వరకు వైసీపీ కి టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు ఎవరూ దరిదాపుల్లోకి రారని భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన గెలుపు ఊపుతో టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. పొత్తుల విషయంలో ఆచితూచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.


టీడీపీ ఒంటరిగా నిలబడాలని నిర్ణయించుకుంటే వైసీపీని ఓడించగలదా.. జనసేన ఓట్లు చీల్చితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటనే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన ఎత్తుగడలు సాధారణ ఎన్నికల నాటికి అనుసరిస్తే టీడీపీ గెలుపు బాట పట్టవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: