మనలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నిద్రలో కొన్ని సందర్భాల్లో గురక పెడతారు. కానీ కొంతమందికి ఇది శాశ్వత సమస్యగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది కొన్ని తీవ్రమైన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కూడా కావచ్చు. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా గురక నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. గురక అనేది తరచుగా అబ్‌స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అని పిలువబడే స్లీపింగ్ డిజార్డర్‌. అయితే అన్ని గురకలు కూడా OSAకి సంబంధించినవి కావు. OSA గురకలో ఈ లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. నిద్రలో శ్వాసను ఆపడం, అధిక పగటి నిద్ర, నిద్ర లేవగానే గొంతు నొప్పి, రాత్రిపూట ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, రాత్రి ఛాతీ నొప్పి, అధిక రక్త పోటు ఇంకా బిగ్గరగా గురక రావడం.. క్షణాలు ఏవైనా కనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.అలాగే మన జీవనశైలి మార్చుకోవడం ద్వారా గురక నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గడం, నిద్రపోయే ముందు ఆల్కహాల్ తాగడం ఖచ్చితంగా మానుకోవాలి, వెళ్లకిలా పడుకుని నిద్రపోకపోవడం ఇంకా నిద్ర లేమిని నివారించడం.. వంటి చిన్నచిన్న మార్పులను చేసుకోవాలి.మనం వెళ్లకిలా పడుకోవడం వల్ల కొన్నిసార్లు నాలుక గొంతు వెనుకకు వెళుతుంది.


అయితే ఇది గొంతు ద్వారా గాలి ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకుంటుంది. గాలి మరింత సులభంగా ప్రవహించడానికి ఇంకా గురకను తగ్గించడానికి ఒకేఒక మార్గం ఒకవైపుకు తిరిగి పడుకోవడం.ఎందుకంటే ఒకవైపుకు తిరిగి పడుకుంటే శ్వాస సులువుగా మారి గురక రాకుండా అడ్డుకుంటుంది.గురక తగ్గాలంటే ఖచ్చితంగా ప్రతి రోజూ 7-9 గంటలు నిద్రపోవాలి. తగినంత నిద్రలేకపోతే ఖచ్చితంగా గురక వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, నిద్ర లేకపోవడం వల్ల గురక వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది మన గొంతులోని కండరాలను సడలిస్తుంది. అందువల్ల వాయుమార్గంలో అడ్డంకి ఏర్పడుతుంది. అలాగే గురక నిద్ర లేమి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇది మన నిద్రకు భంగం కలిగిస్తుంది.ఇంకా అలాగే ధూమపానం గురక సమస్యను మరింత తీవ్రతరం చేసే అలవాటు. ఇక గురకకు గల కారణాల్లో ధూమపానం కూడా ఒకటి.ఈ ధూమపానం OSA ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: