
‘ఈ ప్రపంచం మొత్తాన్ని దేవుడే సృష్టించాడని చెబుతారు. అదే నిజమైతే ప్రస్తుతం మనకెంతో ఇష్టమైన వారిని చంపుకుని తీసుకెళుతున్న కరోనాను కూడా దేవుడే సృష్టించి ఉంటాడు కదా. అలాంటప్పుడు ఆ దేవుడినే మళ్లీ మనం ఎందుకు ప్రార్థిస్తున్నాం..’ అని ప్రశ్నించాడు. ట్వీట్ చివర్లో వరుసగా ప్రశ్నార్థకం సింబల్స్‌ను పెట్టాడు. అంటే దాని ద్వారా తాను ఆ ప్రశ్నను ఎంత గట్టిగా చెప్పాలనుకుంటున్నాడో వాటి ద్వారా చెప్పాడనిపిస్తోంది..
కాగా.. ఆర్జీవీ స్నేహితుడు శేఖర్ ఈ రోజు కరోనా కారణంగా మరణించినట్లు ఆర్జీవీ స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు .శేఖర్ మరణం చాలా బాధిస్తోందని, తనకు అతడు చాలా కావలసిన వ్యక్తిని, తన జీవితంలో అతడు చాలా కీలకమని ఆ ట్వీట్లో ఉద్వేగపూరితంగా రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ట్వీట్ ద్వారా ఆయనకు సన్నిహితులకు, తెలిసిన వారికి అందరికీ ఆయన మరణ వార్త చేరవేస్తున్నానని ఆర్జీవీ తన ట్వీట్లో పేర్కొన్నాడు. శేఖర్ లేని లోటు నిజంగా ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శీంతి కలగాలని ‘RIP’ సందేశంతో ట్వీట్‌ను ఎండ్ చేశాడు. అలాగే ఈ ట్వీట్‌కు శేఖర్ మృతిపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్చిన ఓ కథనాన్ని జత చేశాడు.