
శర్వానంద్, రామ్ చరణ్ ఎక్కడ కలుసుకున్నా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇకపోతే యువ హీరో శర్వానంద్ మరికొన్ని రోజుల్లో ఒక ఇంటివాడు కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది.. పద్మ అనే ఒక ఎన్నారై అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 26వ తేదీన హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఘనంగా నిశ్చితార్థం జరగబోతుందని ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
కాగా ఇప్పటికే శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, రానాలకు పెళ్లి జరిగింది. ఇక ఇప్పుడు శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతుండడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఇప్పుడు శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితుడికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట చరణ్. అయితే ఈ గిఫ్ట్ కాస్త కాస్లిదే అన్నది తెలుస్తుంది. ఏకంగా మూడు కోట్ల విలువైన ఖరీదైన కారును తన స్నేహితుడు పెళ్లికి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాడట రామ్ చరణ్. ఇందుకు సంబంధించిన టాక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఇక ఇది నిజమే అనుకుంటున్నారు అందరూ. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం శర్వానంద్ పెళ్ళి వరకు ఆగాల్సిందే మరి.