
అయితే ఒకప్పుడు యాంకర్ సుమ వరుస కార్యక్రమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు సుమ కాస్త షోలు తగ్గించిన నేపద్యంలో ఇక ఇప్పుడు సుమా కంటే శ్రీముఖి బిజీగా మారిపోయింది. వరుసగా చాన్సులు కొట్టేస్తుంది. ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ సైతం అటు శ్రీముఖికి సరైన పోటీ ఇవ్వలేక పోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెరపై తనకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఏకంగా ఒక్కో షో కి ఒక్కరోజు ఎపిసోడ్ కోసం శ్రీముఖి మూడు నుంచి ఐదు లక్షల పారితోషకం తీసుకుంటుందట.
అయితే శ్రీముఖికి ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృశ్య అటు షో నిర్వాహకులు కూడా ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదట. కేవలం యాంకర్ సుమ మాత్రమే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ గా తెలుగు బుల్లితెరపై కొనసాగేది. ఇక ఇప్పుడు పారితోషకం విషయంలో శ్రీముఖి కూడా అటు సుమాకి గట్టి పోటీ ఇస్తుంది అన్నది తెలుస్తుంది. కాగా ఈటీవీ ప్లస్ లో ప్రారంభమైన పటాస్ అనే కార్యక్రమం ద్వారా శ్రీముఖి అందరికీ సుపరిచితురాలుగా మారిపోయి.. ప్రతి తెలుగింటికి దగ్గరయింది అన్న విషయం తెలిసిందే.