దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇంతటి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న శంకర్ ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ కి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చెంజర్ మూవీ కి దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఒక పక్క ప్లానింగ్ తో శంకర్ పూర్తి చేస్తూ వస్తున్నాడు.

కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లో షూటింగ్ లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.

మరి కొంత కాలం లోనే ఈ సినిమా విడుదల తేదీలను కూడా మూవీ బృందాలు ప్రకటించబోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ ల తర్వాత శంకర్ మరో టాలీవుడ్ స్టార్ హీరో తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో శంకర్ తన తదుపరి మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: