
గుడి లోపలికి వెళ్లి నీరు తాగిన అందుకే ఆ బాలుడిని యాదవ్ కొట్టాడని తెలుస్తోంది. ఐతే వైరల్ అయిన వీడియో లో యాదవ్ ఆ బాలుడి పేరు అడగడం మనం వినవచ్చు. ఆ తర్వాత వీడియోలో తన పేరు ఆసిఫ్ అని బాలుడు సమాధానం ఇవ్వగానే .. కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఆ బాలుడిని కిందపడేసి బలంగా తన్నాడు. ఈ ఘటన దశ్న దేవి ఆలయం వద్ద జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని మొదటిసారిగా హిందూ ఎక్త సంఘ్ అనే ఓ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ అమానవీయమైన ఘటన చూడగానే నెటిజనులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్ దీనికి సంబంధించిన వీడియో ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు స్పందించారు. ఈ వీడియో మా దృష్టికి రావడంతో వెంటనే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశామని ఘజియాబాద్ పోలీసులు నిందితుడు ఫోటోతో సహా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా భారతీయ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియ రాలేదు. అయితే యాదవ్ పై బాధిత బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు లేదో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అభం శుభం తెలియని బాలుడిని దారుణంగా కొట్టటం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.