జమ్మూ కాశ్మీర్ లో విజయవంతంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది.    జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అయున రెండేళ్ల తర్వాత తొలిసారిగా అమిత్ షా పర్యటన కానుండంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ను ఎందుకు ఆపాలి…!? ఏదీ ఆగదు….!! అని స్పష్టం చేశారు అమిత్ షా.  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, తదనంతరం రాష్ట్ర హోదా పునరు ద్ధరణ జరుగుతుందని స్పష్టం చేశారు అమిత్‌ షా. 
 
శ్రీ నగర్ లోని యూత్ క్లబ్ లకు చెందిన సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ స్పష్టం చేసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా... ఈ ఏడాది ఆరంభం లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాని మోడి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లతో సమావేశం జరుగనుంది. ఈ సందర్బంగా, సాధ్య మైనంత త్వరగా  అసెంబ్లీ నియోజ కవర్గాల పునర్వి భజన ప్రక్రియ ను పూర్తి చేసుకోవడం తోపాటు, “రాష్ట్ర హోదా” ను కల్పించే తదనంతర ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఇరువురు నేతలు హామీ ఇచ్చారు.  

ఓ వైపు, పూంచ్ సెక్టార్ లో కొనసాగుతున్న తీవ్రవాదులను తుద ముట్టించే కార్యక్రమం లో ఇద్దరు సైనికాధి కారులతో  సహా, మొత్తం 9 మంది సైనికులు వీర మరణం పొందారు.  మరోవైపు, పెద్ద ఎత్తున  కాశ్మీరు పండిట్ లు, ఇతర రాష్టాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వలస కూలీలను జమ్ముూ కాశ్మీర్ ను వీడిపోయేలా చేసిన పౌరుల  హత్యలు చోటు చేసు కున్నాయి. ఇక ఇవాళ  కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: