
ఈ క్రమం లోనే అమెరికా చైనా విషయం లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అటు చైనాను ఆర్థికం గా కుదేలు అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి ఒలంపిక్ క్రీడలను బీజింగ్లో నిర్వహించాల్సి ఉండగా ఇక బీజింగ్ ఒలింపిక్స్ దౌత్య పరమైన బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా ప్రకటన చేసిన వెంటనే ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో కూడా ఇదే బాట లో నడిచాయి. దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇక ఇప్పుడూ మరోసారి చైనా ను ఆర్థికం గా దెబ్బకొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. ప్రస్తుతం జింజియాంగ్ ప్రావిన్స్ లో చైనా ప్రజలందరినీ బానిసలుగా మార్చుకుని ఏకంగా తక్కువ వేతనం చెల్లించి ఎక్కువ పని చేయించుకుంటూ ఉంటుంది. ఇక జింజియాంగ్ ప్రావిన్స్ లో ఎప్పుడుమానవ హక్కులను కాలరాస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో తయారైన వస్తువులను తమ దేశంలోకి దిగుమతి చేసుకోవము అంటూ ఇటీవల అమెరికా ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాకు ఆర్థికంగా చెక్ పెట్టడానికే అని అంటున్నారు విశ్లేషకులు.