ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదనే చెప్పాలి...ఆనం గురించి ఏపీ ప్రజలకు బాగా తెలుసు..అలాగే ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కూడా తెలిసిందే..టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి...తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళి పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు..రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వదిలి మళ్ళీ టీడీపీలోకి వచ్చి..అక్కడ కూడా సెట్ అవ్వలేక వైసీపీలోకి వచ్చి...2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి..ఇప్పుడు అక్కడ కూడా సరిగ్గా ఉండలేని పరిస్తితుల్లో ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆనం మంత్రి పదవి ఆశించారు గాని...పదవి రాలేదు..ఇక పదవి ఎప్పుడైతే రాలేదో అప్పటినుంచి ఆనంకు వైసీపీలో అనుకున్న మేర ప్రాధాన్యత అయితే దక్కలేదనే చెప్పాలి...అలాగే ఆయన అధికారులకు చెప్పి పనులు చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు..దీంతో పలుమార్లు అధికారులపై డైరక్ట్‌గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి..అసలు ఏపీలో తన నియోజకవర్గం వెంకటగిరి ఒక భాగం కాదని అధికారులు అనుకుంటున్నారని చెప్పి ఫైర్ అయ్యారు.


అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై పలు మార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు...ఇలా ఎక్కడకక్కడ ఆనం తన అసంతృప్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు..ఇదే క్రమంలో తాజాగా జిల్లాల విభజనపై కూడా ఆనం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...అసలు జిల్లాల విభజన సరిగ్గా జరగలేదనే కోణంలో ఆనం..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో ఆనంకు పడటం లేదు.

అక్కడ రెండు వర్గాల రాజకీయం నడుస్తోంది..ఎమ్మెల్యేగా ఆనం ఉన్నా సరే..నియోజకవర్గంలో నేదురుమల్లి హవానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇలా సొంత పార్టీపైనే ఆనం విమర్శలు చేయడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. సమయం బట్టి ఆనంకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది...ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వలేదు...ఇక నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది..వెంకటగిరి సీటు నేదురుమల్లికి ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఆనం భవిష్యత్ ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: