బీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ లో ఆరంభ, ముగింపు వేడుకలను కొన్నేళ్లపాటు నిర్వహించలేకపోయింది బీసీసీఐ. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక ఎప్పటిలాగానే భారత్లోని అన్ని వేదికలపై కూడా మ్యాచ్లు నిర్వహిస్తుంది. అదే సమయంలో ఇక ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ వచ్చి తన గాత్రంతో ఐపీఎల్ ప్రేక్షకులందరినీ కూడా అలరించాడు. ఇక మరోవైపు మిల్కీ బ్యూటీ తమన్న, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు కూడా ఇక ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో డాన్స్ చేసి అదరగొట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఎలా అయితే నిర్వహించిందో.. ఇక ముగింపు వేడుకలను కూడా అదే రీతిలో గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీన జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.



 ఈనెల 28వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుల ప్రెసిడెంట్స్ హాజరవుతారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. అనంతరం ఆసియా కప్ 2023 గురించి చర్చిస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక ఐపీఎల్ ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అటు క్రికెట్ లవర్స్ అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెన్నై ఫైనల్ లో అడుగుపెట్టగా ఇక రెండో ఫైనలిస్ట్ ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl