సైబర్ నేరగాళ్లు ఈ మధ్య బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగె షాక్ ఇస్తున్నారు... ఏదేదో అని చెప్పి డబ్బుల ను కాజెయ్యడాని కి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. దాంతో చాలా మంది నష్ట పోతున్నారు.. ఇలా చాలా మంది నేరగాళ్ల చేతిలో మోసపొయారు.. ఈ మేరకు బ్యాంక్‌లు కస్టమర్ల కు అలర్ట్ చేస్తున్నారు.. ప్రైవేట్ రంగానికి చెందిన దేశీ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి.

 

బ్యాంక్ తన కస్టమర్ల ను హెచ్చరిస్తోంది. మోసగాళ్ల కు జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు నిర్వహించని ఎఫ్‌డీ లేదా ఆర్‌డీ ట్రాన్సాక్షన్‌ కు సంబంధించి మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా.. అయితే మోసగాళ్ల తో జాగ్రత్తగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. మోస గాళ్లు ఫేక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా కాల్ చేసి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్‌ లోడ్ చేయాలని కోరతాయని, అలా బ్యాంక్ సర్వీసుల పై ధ్రువీకరణ  పొందు తున్నారు..


అలాంటి వాటికి మోస పొవద్దని హెచ్చరిస్తున్నారు.. బ్యాంక్ కస్టమర్లు మోసగాళ్ల తో జాగ్రత్త గా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హెచ్చరించింది. మోసగాళ్లు చెప్పినట్లు చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని పేర్కొంది. అందు వల్ల అప్రమత్తం గా ఉండాలని కస్టమర్ల కు సూచించింది. అంతేకాకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ పేరు తో మోసాల కు పాల్పడవచ్చని గుర్తు చేశారు.. బ్యాంక్ నుంచి ఎటువంటి కొత్త ప్రకటనలు రావని గుర్తు చేశారు.. ఏది ఏమైనా కూడా బ్యాంక్ నుంచి అంటూ వస్తున్న మెసేజ్ లకు స్పందించ వద్దని హెచ్చరిస్తోంది... మోసపొక ముందే జాగ్రత్త పడటం వల్ల డబ్బులను ఆధా చేసుకొవచ్చు.. అని సంబంధిత బ్యాంక్ కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: