తాజాగా పోలీసులు బయటపెట్టిన అంశాలతో మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్లే అనిపిస్తోంది. వారం రోజుల క్రితం బోయినపల్లిలోని ముగ్గురు సోదరులను అఖిలప్రియ తన భర్త భార్గవరామ్, మరిది చంద్రహాస్ అండ్ 14 అదర్స్ సాయంతో కిడ్నాప్ చేసిన విషయం ఎంత సంచలనమైందో కొత్తగా చెప్పక్కర్లేదు. అర్ధరాత్రి సోదరుల ఇంటికి వచ్చిన కిడ్నాపర్లు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులమని నమ్మించి ఇంట్లోకి వెళ్ళారు. తర్వాత సోదరులు ముగ్గురిపై దాడిచేసి చేతులు కట్టేసి కారుల్లో తీసుకెళుతున్నపుడు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చేసింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి అన్నీవైపులా గాలింపులు మొదలుపెట్టడంతో చేసేది లేక సోదరులను వదిలిపెట్టి అందరు పారిపోయారు. తర్వాత సోదరులిచ్చిన ఫిర్యాదుతో అఖిలను పోలీసులు అరెస్టు చేశారు.




మాజీమంత్రిని పోలీసులు అరెస్టు చేయగానే చెల్లెలు మౌనిక, సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి పోలీసులపై ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేస్తునే తమ సోదరి అఖిలప్రియను వివేకానందుడి శిష్యురాలన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. అఖిలను ఎందుకు పోలీసులు అరెస్టు చేశారో కూడా తమకు తెలీదని, తమ సోదరికి వ్యతిరేకంగా ఏ కేసు లేదంటు నానా గోల చేస్తున్నారు. తమ సోదరిని పోలీసులు ఓ టెర్రరిస్టును ట్రీట్ చేసినట్లు చేస్తున్నట్లు వలవల ఏడుస్తు మీడియాతో చెప్పారు. అయితే సోమవారం పోలీసులు బయటపెట్టిన విషయాలు విన్న తర్వాత మరి తమ సోదరి గురించి ఏమి మాట్లాడుతారో చూడాలి. పోలీసులు బయటపెట్టిన వివరాల ప్రకారం కిడ్నాప్ కు సూత్రదారే అఖిల. కిడ్నాప్ కోసమే అఖిల ప్రత్యేకంగా మొబైల్ నెంబర్లు వాడినట్లు తేలింది. తానుమాత్రమే కాకుండా తన భర్త, మరిది, కిడ్నాప్ ఘటనలో పాల్గొన్నవారందరికీ వేరే నెంబర్లను అఖిలే కేటాయించిందట.




కిడ్నాప్ విషయమై తమ గ్యాంగ్ తో అఖిల, భర్త, మరిది ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డింగులు కూడా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అరెస్టయిన ముగ్గురి కారణంగా కిడ్నాప్ లో అఖిల పాత్ర ఏమిటి ? మొబైల్, సిమ్ కార్డుల విషయం కూడా బయటపడింది. మరి గడచిన వారంరోజులుగా తమ సోదరి విషయంలో మౌనిక, తమ్ముడు చెబుతున్నవంతా ఉత్త కబుర్లే అని అర్ధమైపోయింది. ఒక మహిళని కూడా చూడకుండా పోలీసులు తమ అక్కను అరెస్టు చేసిన తీరుకు మౌనిక ఆరోపణలతో రెచ్చిపోయింది. ఆడది..ఆడది అని ఒకటికి పదిసార్లు అరిచి గీ పెడితే సెంటిమెంటు బాగా పండుతుందని బహుశా మౌనిక భావించుంటుంది. కానీ అసలు విషయం మౌనికకు తెలీకుండానే ఉంటుంది. తన అక్క మనస్తత్వం చెల్లి, తమ్ముడికంటే బాగా చెప్పగలిగిన వాళ్ళెవరుంటారు ? ఏదో కిడ్నాప్ గొడవ బయటపడి అడ్డంగా దొరికిన తర్వాత ఇంత గోల చేస్తున్నారన్న విషయం జనాలందరికీ అర్ధమైపోతోంది. మరి మూడు రోజుల పోలీసు కస్టడీలో అఖిల ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందో చూద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: