దేశ స్వాతంత్య్రం కోసం, ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారతభూమిని విడుదల చేయటం కోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా శాంతిమార్గంలో ఎంతటి మహత్తర కార్యాన్నైనా సాధింపవచ్చని నిరూపించిన ధీశాలి మహాత్మాగాంధీ. ఆయన చూపిన మార్గం కేవలం భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఒక వెలుగుబాటగా నిలిచిపోయింది. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శం. ఆయన మార్గం అనుసరణీయం. ఆయన కార్యశీలత ప్రశంసనీయంగా కీర్తింపబడుతున్నాయి.


ఆయన తరతరాల భారత ఆధ్యాత్మిక వికాసానికి, శాంతి సౌభాగ్యాలతో కూడిన జీవన విధానానికి, ధర్మయుతమైన ప్రవర్తనకు ప్రతీకగా నిలిచిపోయినాడు.  హింసతో కూడిన యుద్ధం చేసే వాడు యోధుడు మరి అహింసనే యుద్దంలా చేస్తే అతన్ని దేవుడు అనాలేమో. ఆ విధంగా చూస్తె చరిత్రలో అప్పటివరకు చూడని, ఇంకెప్పటికి చూడలేని నాయకుడు, దేవాలయాలు హారతులు పూజలు అందుకొని దేవుడు గాంధీజీ.  


అటువంటి మహానుభావుని జీవితం గురించి తెలుసుకొనటం మనకు అత్యవసరం, ఆయన పయనించిన మార్గంలో ప్రయాణం చేయటం అనుసరణీయం. భారతదేశ శాంతి సహనశీలతలకు ఆయన చిహ్నం. మహాత్ముడి సందేశంతో ఆయనతో పయణించిన వారు ఎంతో మంది ఉన్నారు.  కొన్ని విషయాల్లో విభేదించినా..ఆయన వ్యక్తిత్వానికి ఎంతో గౌరవం ఇచ్చారు..అలనాటి స్వతంత్ర సమరయోధులు.  


1.గాంధీజీ తన జీవితకాలంలో రోజుకు సుమారుగా 18 కిలోమీటర్ లు నడిచేవారట. అలా చేస్తే భూమధ్య రేఖ మీదుగా భూమి చుట్టూ రెండు సార్లు తిరిగి రావచ్చు.

2. గాంధీజీకి ఫోటోలు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు..కనుక అనుకోకుండా ఎక్కువ అత్యదికంగా ఫోటోలు ఉన్న వ్యక్తీ గాంధీ కావడం విశేషం. 

3. మహాత్మాగాంధీ తన జీవిత కాలం లో ఎప్పుడు విమానం ఎక్కలేదు. మాతృభాష గుజరాతి అంటే అమితమైన ఇష్టం, ఆయన జీవిత చరిత్రని గుజరాతిలో రాసి తర్వాత ఆంగ్లీకరించారు.

4. 2007 లో ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.

unnamed (6)

5.నెహ్రు కూతురు ఇందిరా, ఫిరోజ్ అనే ముస్లిం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహాలు ప్రోత్సహించే గాంధీజీ, నెహ్రు బాధపడటం చూడలేక ఫిరోజ్ ని ఫిరోజ్ గాంధీ గా పేరు మార్చుకోమని చెప్పారట.

6. 1921 వరకు గాంధీజీ అందరిలానే దుస్తులు ధరించేవారు, 1921 లో తమిళనాడు లోని మధురై వెళ్ళినప్పుడు అక్కడి పేద వాళ్ళు పంచె మాత్రమె కట్టుకొని రావటం తో అప్పటి నుండి ఆయన కూడా కేవలం పంచె మాత్రమె వాడేవారు.

7. 1930 టైమ్స్ పత్రిక మాన్ అఫ్ది ఇయర్ గా గాంధీ ని ఎన్నుకుంది. 1999 లో అదే పత్రిక ప్రకటించిన మాన్ అఫ్ ది సెంచరీ జాబితా లో రెండో స్తానం పొందారు గాంధిజీ

unnamed (7)

8.1987 లో మొదటిసారిగా గాంధీ గారి బొమ్మతో 500 రూపాయల నోటు ముద్రించారు. 1997 నుండి అన్ని నోట్లపై గాంధీ గారి బొమ్మ వేయటం మొదలెట్టారు. మన నోట్లపై ఉండే గాంధీజి బొమ్మ 1946 లో దిగిన ఫోటో నుండి తీసుకున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: