ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో కొత్త రకం మొబైల్స్ ను అందించి యువత మనసును దోచుకుంది. ఇప్పుడు మరో బడ్జెట్
ఫోన్ ను
మార్కెట్ లోకి విడుదల చేసింది. అది కూడా మంచి క్రేజ్ ను ఆందుకుంది. అదేంటో ఆలస్యం లేకుండా ఒకసారి చూద్దాం. రియల్‌మీ చైనాలో బడ్జెట్ 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. క్యూ3 సిరీస్‌లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవే రియల్ మీ క్యూ3, రియల్ మీ క్యూ3 ప్రో, రియల్ మీ క్యూ3ఐ స్మార్ట్ ఫోన్లు. రియల్ మీ క్యూ3లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించగా, రియల్ మీ క్యూ3 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌ను, రియల్ మీ క్యూ3ఐలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు..
ఇకపోతే ఈ ఫోన్ల ధర ప్రారంభం నుంచే 11,600 గా కంపెనీ వెల్లడించింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,000 నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,200 ఉంది. సైక్‌డెలిక్ సిల్వర్, సైఫై బ్లాక్ రంగుల్లో ఈ
ఫోన్ కొనుగోలు చేయవచ్చు.రియల్ మీ క్యూ3 ప్రో ధర.. రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,800 నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.23,100 నిర్ణయించారు. ఎలక్ట్రిక్ బ్లూ, ఫైర్‌ఫ్లై, గ్రావిటీ బ్లాక్ రంగుల్లో ఈ
ఫోన్ కొనుగోలు చేయవచ్చు..
చివరిగా,రియల్ మీ కూ3ఐ ధరను చూస్తే..ఈ మూడు ఫోన్లలో చవకైన
ఫోన్ ఇదే. దీని11,600 నుంచి ప్రారంభం కానుంది. ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,700ఉంది. లైట్ బ్లూ, పార్టికల్ యాష్ రంగుల్లో ఈ
ఫోన్ లాంచ్ అయింది.. అయితే, ఈ ఫోన్లు అన్నీ కూడా ఆండ్రాయిడ్ 11 పై పని చేస్తున్నాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మాత్రం కెమెరాలు.. 48 మెగా పిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. అన్నీ యువతను ఆకట్టుకోవడంతో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది..