మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తిని హత్య చేయాలని వచ్చిన రౌడీలు పొరపాటున మరో వ్యక్తిని హత్య చేస్తూ ఉంటారు. నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అంటే అసాధ్యం అని చెబుతూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యను హత్య చేయాలనుకున్నాడు భర్త. దీనికోసం పక్కా ప్లాన్ వేసాడు. కానీ చివరికి ప్లాన్ బోల్తా కొట్టింది. భార్యను హత్య చేయాలనుకుని వేరే మహిళ ప్రాణాలు తీసేసాడు.


 ఈ ఘటన తిరువన్నమలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద చోటు చేసుకుంది. నగరానికి చెందిన దేవేంద్రన్ పశువుల వ్యాపారి. అతని మొదటి భార్య రేణు 2 సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఈ క్రమంలోనే ఇక అదే ప్రాంతానికి చెందిన భర్తను కోల్పోయిన ధనలక్ష్మిని ఐదు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు దేవేంద్రన్. ఈ భార్య భర్తలు ఇద్దరికీ కూడా ఎప్పుడూ పోసిగేది కాదు. తరచూ గొడవలు పడుతూ ఉండేవారూ. ఇటీవల భర్తపై అలిగి ధనలక్ష్మి అంబుర్ లో ఉన్న  పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అంబురు కోటంపల్లికి చెందిన జాన్ బాషా అనే వ్యక్తి భార్యకు పాదరక్షలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. రాత్రి సమయంలో దుకాణాల వద్ద నిద్రిస్తూ ఉండేది జాన్ భాషా భార్య గౌసర్.


 ఈ క్రమంలోనే దేవేంద్రన్ తన భార్య ధనలక్ష్మి కూడా రాత్రి సమయంలో దుకాణాల ఎదుట నిదురిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అక్కడికి వచ్చాడు  ఇక అక్కడే ధనలక్ష్మితో పాటు జాన్ బాషా భార్య గౌసర్ ఆమె అత్త పర్వీన్ కూడా పిల్లలతో కలిసి నిద్రిస్తున్నారు. అక్కడికి వచ్చిన దేవేంద్రన్ చీకట్లో ధనలక్ష్మి అనుకోని గౌసర్ ను కత్తితో గొంతు కోశాడు. ఛాతి భాగంలో పొడిచాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు వదిలింది  పక్కనే ఉన్న ధనలక్ష్మికీ కూడా కత్తిపూడి పడడంతో ఆమె నిద్ర లేచి గట్టిగా అరిచింది. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.  ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: