కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా మోహన్ బాబు అనేక మూవీ లలో హీరో గా నటిస్తున్నప్పటికీ భారీ బ్లాక్ బస్టర్ విజయాలను మాత్రం మోహన్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోతున్నాడు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు ప్రస్తుతం సినిమాల్లో హీరో పాత్రలో మాత్రమే కాకుండా ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే మోహన్ బాబు "సన్ ఆఫ్ ఇండియా" అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన తమిళ , తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మోహన్ బాబు విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ... విశాల్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో అతడు పిలవగానే ఈ ఫంక్షన్ కి వచ్చాను. పందెంకోడి , పొగరు మూవీ లలో విశాల్ నటన నాకు చాలా బాగా నచ్చింది. విశాల్ కు నిజంగానే పొగరు ఉంది అని నాకు తెలుసు. మనిషికి  పొగరుండాలి కానీ అది ఎదుటి వారికి ఏ మాత్రం హాని చేసేలా ఉండకూడదు. లాఠీ మూవీ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా కూడా పందెంకోడి లా అద్భుతమైన విజయం అవుతుంది అని మోహన్ బాబు అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: