టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యాపారాల ద్వారా పలు ఉత్పత్తుల ద్వారా కూడా భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తున్నాడు మహేష్ బాబు. అయితే తాజాగా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో ఒక పానియన్ సినిమాలో నటించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కాదని పాన్ వరల్డ్ సినిమా అని అంటున్నారు. ఇక మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమా కోసం అత్యధిక టెక్నాలజీని తీసుకొచ్చి విజువల్ వండర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట రాజమౌళి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత పారితోషకాన్ని తీసుకుంటున్నాడు అన్న టాపిక్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాల పాటు డేట్స్ ని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 100 కోట్ల రెమ్యూనిరేషన్ను తీసుకుపోతున్నాడని అంటున్నారు. మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మహేష్ బాబు డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారట దర్శక నిర్మాతలు. ఏదేమైనా రెండేళ్ల తన సమయాన్ని కేవలం రాజమౌళికి కేటా యించడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: