ఏపీ రాజకీయాలను కొద్దికాలంగా ఒక ఊపు ఊపేస్తున్న 3 అంకె ప్రభావం  తారస్ధాయికి చేరుకుంటోంది. ఇక్కడ 3 అంకె అంటే వైసీపీ తరపున 3 రాజధానులు, 3 పెళ్ళిళ్ళని. 3 అంకెను జగన్మోహన్ రెడ్డితో పాటు యావత్ వైసీపీ నేతలు బాగా ప్రచారంలోకి తెచ్చారు. 3 పెళ్ళిళ్ళంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ర్యాంగింగ్ చేయటంకోసమే తప్ప మరో విషయంలేదు. పవన్ను ఉద్దేశించి చాలాకాలంగా వైసీపీ 3 పెళ్ళిళ్ళంటు నానా రచ్చచేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో 3 రాజధానులను ప్రస్తావన కూడ గట్టిగానే తెస్తున్నారు.





తాజాగా విశాఖపట్నం ఎపిసోడ్లో ఆ రచ్చను మంత్రులు బాగా ఎక్కువచేశారు. దాంతో ఆవేశంలో పవన్ కూడా వైసీపీ ట్రాపులో పడిపోయారు. తాను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నానని తనపై పడి ఏడ్చేబదులు మీరుకూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోండి ఎవరొద్దన్నారు ? అంటు ఫైర్ అయ్యారు. దాంతో మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా పవన్ బంపారఫర్ ను బాగా హైలైట్ చేస్తున్నది. మొత్తంమీద 3 అనే సంఖ్య మాత్రం బాగా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. 






దాంతో అవనిగడ్డలో జరిగిన బహిరంగసభలో  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు  తాము అభివృద్దికోసం మూడు రాజధానులని అంటుంటే కొందరు మూడుపెళ్ళిళ్ళు చేసుకోమని సలహాలిస్తున్నట్లు ఎద్దేవాచేశారు. పవన్ పేరెత్తకుండానే ఆయన మాటలు విన్నవాళ్ళు మూడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం మొదలుపెడితే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్ధితి ఏమిటంటూ జగన్ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళను టార్గెట్ చేశారు. నాలుగేళ్ళో,  ఐదేళ్ళో సంసారం చేసి తర్వాత భర్తలు వదిలేస్తే భార్యల పరిస్దితి ఏమిటి ? అంటూ సూటిగా ప్రశ్నించారు.





పవన్ పేరెత్తకుండానే జగన్ అడిగిన ప్రశ్న సూటిగా ఆడవాళ్ళకు తగులుతుందనటంలో సందేహంలేదు. అయితే అసలు ఇలాంటి చర్చలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అర్దంకావటంలేదు. ఆరోపణలు, విమర్శలు విధానపరంగా కాకుండా వ్యక్తిగతంగా మారిపోయాయి. దాంతో ఏపీలో రాజకీయాలు బాగా కలుషితం అయిపోయాయన్నది వాస్తవం. మరి కాలుష్యానికి అంతమెప్పుడో మాత్రం తెలీటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: