
కరోనా ఎంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. ప్రపంచం మొత్తానికి ఇది ప్రధానంగా కనిపిస్తోంది. కానీ కనిపించని విధ్వంసం మరొకటి, అది తాత్కాలిక నష్టం కాదు సుదీర్ఘకాలిక విధ్వంసం!
కరోనా పాదం మోపిన ప్రతి దేశంలోను ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోవడం. తొలిదశలో చాలా తక్కువ కేసులకే లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు భారత ప్రభుత్వంతో సహా, ఇప్పుడు ఎందుకు లాక్డౌన్ విధించడానికి ఇంతగా ఆలోచిస్తున్నాయెందుకు? ఇది మాత్రం ఆలోచన కాదు. భయం. కారణం ఏంటీ? అన్న ప్రశ్నకు జవాబు “ఆర్థిక వ్యవస్థ సమూల పతనమే”. ఇది ఒక్క భారత్ పరిస్థితి మాత్రమే కాదు. సమస్త ప్రపంచ దేశాల ఆందోళన కూడా.
తొలిదశలో చాలా దేశాలు లాక్డౌన్ విధించినప్పటికీ, ఆ దశలో జరిగిన నష్టం పూడ్చుకునేందుకే ఇప్పటికీ తంటాలు పడుతున్న పరిస్థితి. తద్వారా ఏర్పడ్డ ఆర్ధిక ఉత్పాతాన్నుంచి తమ దేశాలని రక్షించుకునే క్రమం లో ఇప్పుడు లాక్డౌన్ విధించడానికి బయపడుతున్నాయి. తొలిదశ అనుభవం అలాంటిది. మరోసారి లాక్డౌన్ విధిస్తే జరగబోయే అపార నష్టాన్ని ఊహాత్మకంగా నైనా తలుచుకొని కలవరపడుతున్నాయి.
అందుకే ఎంత కష్టమైనా లాక్డౌన్ విధించకుండానే కొవిడ్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో రోజుకు 4 లక్షల కేసులు పైగా నమోదవుతున్నా, లాక్డౌన్ విధించాలని చాలా మంది నిపుణులు సూచిస్తున్నా, భారత ప్రభుత్వం వేచి చూసే ధోరణి అనుసరించటానికి మాత్రం కారణం తగుమోతాదులో నైనా ఆర్ధిక విధ్వంస నివారణే.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే: ప్రపంచం మొత్తం ఇలాంటి ఆర్ధిక సామాజిక రాజకీయ తదితర దారుణ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే:
“సార్స్ కరోన వైరస్ పుట్టిల్లు” చైనా నిబ్బరంగా ఎలా ఉండగలుగుతుంది?
దీని ఆర్ధిక వ్యవస్థ కరోనా సంక్షొభం ప్రారభం నుండి ఎలా ఇలా కొత్త పుంతలు తొక్కుతుంది?
ఆ దేశ జీడీపీ ఎదుగుదల చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. “నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్” వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధిరేటుతో శరవేగంగా పరుగులు తీస్తుంది. ఇది రూపీ మారకంలో చెప్పాలంటే ₹ 2.85 కోట్ల కోట్లకు సమానం.
1992 తర్వాత ముందెన్నడూ చైనా ఈ స్థాయిలో తన జడీపీ నమోదు చేయలేదు. ఆశ్చర్యకరం కదా! ప్రపంచం మొత్తానికి చుట్టుకున్న ఈ అపార విద్వంస కాలంలో చైనా స్వర్ణయుగంలో పయనిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధిలో 14.1శాతం, రిటైల్ విక్రయాల్లో 34.3శాతం అభివృద్ధి నమోదు కావడం బహు విచిత్రం అంతేకాదు అందరూ ఈ అద్భుతాన్ని గమనించి, గుర్తించి ఆలోచించి, అనుసరించాల్సిన వైనం.
ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఇప్పటికే అదీ అతి స్వల్ప కాలంలో అవతరించింది. 2010 తర్వాత జపాన్ ను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్థాయిలో ఏ దేశం కూడా వృద్ధి రేటు నమోదు చేయలేదు. అందులొ మాయేమిటి? పోనీ చైనా అనుసరించిన అద్భుత విధానమెట్టిది? కరోనా కష్టాల్లో పడి ప్రపంచం తలమునలకలై కలవరపాటుతో అవస్థలు పడతుంటే దాన్ని పుట్టించి, ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం దూసుకుపోతుండడం గమనార్హం.
ఇందులో మర్మం మామూలు ఆలోచనలకే అందుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధించి విచారణ చేసినదాంట్లో నిజమెంత? ఇందులో ఏదైనా స్కాం లేదంటారా? ప్రణాళికల ద్వారా తాము సృస్టించ బోతున్న ‘సార్స్ కోవిడ్ వైరస్ ద్వారా ప్రజ్వలిల్లనున్న ప్రమాదాల నుండి తన దేశాన్ని ప్రజలను రక్షించుకునే రక్షణ వ్యూహాన్ని ముందుగానే వ్యూహాత్మకంగా నిర్మించుకున్న చైనాకు - ఇతర దేశాలకు జరిగినట్లు ఎక్కువ నష్టం జరగకుండానే బయటపడింద ని కదా! అర్ధం.
మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సార్స్ కొవిడ్ కరోనా వైరస్’ ను నిర్భయంగా "చైనా వైరస్" అన్నారు కదా! దానికి అయన ఏమాత్రం జంక లేదు కదా! ఈ చైనా దురాగతానికి అక్రమాలకు అన్యాయానికి సాక్షీబూతంగా స్పష్టంగా కనిపిస్తుంది “వైరస్ కు పుట్టినల్లైన చైనా మాత్రమే అభివృద్ధిలో దూసుకు పోతుండడం”
అతి స్వల్ప సమయంలో అంతా తెలిసినట్లు కరోనా నియంత్రణకు హుటాహుటిన ఆ దేశం తీసుకున్న చర్యలు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
*నిబంధనలు కఠినంగా పాటించడం,
*క్షేత్రస్థాయిలో పారిశుధ్య చర్యలు తీసుకోవడం,
*పది రోజుల్లోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించడం,
*అందరికీ వైద్య సహాయం అందేలా చూడడం,
*నిముషాల్లో మౌలిక సదుపాయాలు సాధించటం
ఎన్నో చర్యలను ప్రణాళికా బద్ధంగా చేపట్టింది చైనా. ఎంతో ముందే ఆలొచించినట్లు ప్రపంచ దేశాలన్నీ షాక్ లో కొట్టుమిట్టాడుతున్నవేళ ఒక్క చైనా మాత్రమే అలా ఏలా? సాధించగలిగింది. దీన్ని నిశితంగా గమనిస్తే “వైరస్ ఆధారిత జీవాయుధం” నిర్మించటానికి ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక గానే చెప్పవచ్చు.
తులనాత్మక ప్రణాళిక లేకుంటే ఇంత వేగంగా స్పందించటం 140కోట్ల పైగా జనాభా ఉన్న చైనాలాంటి పెద్ద దేశానికి సాధ్యంకాదు. అంటే జీవాయుధ పరిశోధన మరియు తయారి ఒకప్రక్కన నడుస్తుంటే మరో ప్రక్కన - ఒక వేళ తమ ప్రయోగం అదే ‘జీవాయుధ నిర్మాణం’ ఏ కారణం చేతైనా విఫలమైతే తన దేశంలో జనహననాన్ని నిరోధించే ఔషధాలు, సాంకేతికత, వనరుల సమీకరణ, మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, వైద్య ఆరోగ్య బృందాలను నిశ్శబ్ధం గా సిద్ధంచేసుకొంది.
కరోనా వ్యాప్తి ఫలితంగా ఇరుగు పొరుగు దేశాలు వైద్యారోగ్య సమస్యలు దేశవ్యాప్తంగా తలెత్తినప్పుడు ఆ దేశాలు ఈ మహమ్మారి ప్రమాదం అర్ధంకాక సతమతమౌతుంటే, ఆ దేశాలను ఇరుకున పెట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే తలంపుతో సరిహద్ధు దేశాలతో కయ్యాలకు కాలు దువ్వటం మొదలెట్టింది.
వైరస్ పుట్టుక వ్యాప్తి ప్రపంచానికి 2019లో తెలిసినా, చైనాకు మాత్రం దీన్ని గురించి 2015 సం. ముందే తెలుసు ఎందుకంటే తనే సృష్టికర్త కాబట్టి - తన సంరక్షణ తాను చూసుకుంటూ ప్రమాదవశాత్తు బయట పడ్డ కరోన వైరస్ ప్రమాదాన్ని తొలుత తొట్రుపాటు పడినట్లు నటించి తాను సమర్ధతతో నిలదొక్కుకున్నట్లు ప్రవర్తించింది.
అంతే కాదు ప్రపంచానికి వెంటనే తెలపకుండా మోసం చేసి కరోనా వ్యాప్తికి జ్వాల రగిల్చి ఆ కరోనా మంటల్లో తగలబడుతున్న ప్రపంచ దేశాలను చిద్విలాసంగా చోద్యం చూస్తూ చలి కాసుకుంటుంది. తన దేశం లోపల ఇతర రంగాలపై కరోనా ప్రభావం పడకుండా చూసుకుంది. అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
అమెరికా లాంటి అగ్రదేశం కూడా చైనా కుట్రను గుర్తించక పోవటానికి గుర్తించనట్లు నటించటానికి కారణం చైనాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమికి చైనా దుర్నిరీక్ష్యవ్యూహాలు రచించింది. తన చెప్పుచేతల్లో ఉండే అధ్యక్షుణ్ణి ఆయన బృందాన్ని గెలిపించటం, అమెరికా సింహాసనంపై నిలపటం - దాని నేపధ్యంలో తగిన విధంగా చైనా వ్యూహాత్మకంగా పనిచేసి విజయం సాధించింది.
తాను ప్రయోగించిన "సార్స్ కోవిడ్ కరోనా జీవాయుధం" ఇప్పటికే ప్రపంచంపై పనిచేస్తున్నట్లే కదా! ఆ నేరం చైనాది కాదంటానికి ఇంకా సాక్ష్యాలు అవసరమా! ఇక చైనాని దాని నేరాలని బయటపెట్టి ప్రపంచం ముందు నిలబెట్టకపోతే, అమెరికా ఇప్పుడు చైనా ఎడం కాలి చెప్పుగా మారినట్లే.