టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్ని సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన నటించిన మహాత్మా సినిమాకు గాను ఈయన నంది అవార్డును కూడా అందుకున్నాడు. దాదాపు 120 సినిమాలకు పైగా నటించాడు ఈయన. తాజాగా ఆఖండ, సన్నాఫ్ ఇండియా సినిమాలలో నటించాడు శ్రీకాంత్. ఇక ఆయన నటించిన వారిసు సినిమా జనవరిలో విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ఆయన కలిసి నటించిన హీరోయిన్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు శ్రీకాంత్. 

ఇందులో భాగంగానే రోజా గురించి మాట్లాడుతూ.. కొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. ఘటోత్కచుడు, తిరుమల తిరుపతి వెంకటేశ మరియు ఇతర సినిమాలలో వీరిద్దరూ జంటగా నటించారు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.వీరిద్దరి నటన కి చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే వెండితెరపై వీరిద్దరి రొమాన్స్ చూసి చాలామంది వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్లు చేయడం జరిగింది. అంతేకాదు అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ కూడా ఉంది అన్న వార్తలు సైతం రావడం జరిగింది. అయితే దీనికి గాను శ్రీకాంత్ వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతోపాటు రోజా శ్రీకాంత్ ని అన్నయ్య అని పిలిచేది అంటూ చెప్పవచ్చాడు. మా ఇద్దరి షూటింగ్ సమయంలో రోజా నన్ను ఎప్పుడు అన్నయ్య అని ప్రేమగా పిలిచేది అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. షూటింగ్లో పాల్గొనే సమయంలో ఈ సీన్ ని ఇలా చేస్తే బాగుంటుంది అన్నయ్య లేదా అలా చేస్తే బాగుంటుంది అన్నయ్య అంటూ ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది. అంతేకాదు మా ఇద్దరికీ సంబంధించి ఏదైనా రొమాంటిక్ సీన్ వస్తే అందులో కూడా అన్నయ్య అంటూ నన్ను ఆట పట్టించేది అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: